Home  »  TV News  »  సుధీర్ కాంట్రాక్టు ఐపోయింది.. అందుకే వెళ్ళిపోయాడు!

Updated : Jul 11, 2022

సుధీర్ అన్ని షోస్ నుంచి ఎందుకు వచ్చేసాడు, దానికి కరెక్ట్ రీజన్ ఏమిటి?.. అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అందరూ ఊహాగానాలు చెప్తున్నారు తప్ప ఫ‌లానా కారణంగా వెళ్లిపోయాడనే విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పట్లేదు. సుధీర్ వెళ్లిపోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయిన వాళ్ళు ఎక్కువ.. లోపలి వచ్చిన వాళ్ళు తక్కువ. అసలేమయ్యింది.. మల్లెమాల అన్ని ఇబ్బందులు పెట్టబట్టే వచ్చేసాడా.. ఫుడ్ బాలేక వచేసాడా.. రెమ్యూనరేషన్ పెంచలేదని వచేసాడా.. సుధీర్ కి తప్ప మల్లెమాలకు ఫాలోయింగ్ రావడం లేదన్న రూమర్ తో వచ్చేసాడా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఆడియన్స్ లో.

ఐతే అదిరే అభి ఈ ప్రశ్నలన్నింటికీ బ్రేక్ వేస్తూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఒక పాయింట్ చెప్పాడు. "కాంట్రాక్ట్స్ ఐపోయిన వాళ్ళు ఎవరికి వారు యాజమాన్యంతో మాట్లాడుకుని ఇంటరెస్ట్ ఉంటే కంటిన్యూ అవుతారు, లేదంటే మాత్రం బయటికి వచ్చేస్తారు. అది వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ వాళ్ళ ఛాయిస్ తప్ప వేరే రీజన్ అంటూ ఏమీ లేదు" అని చెప్పాడు. సుధీర్, రష్మీ గురించి అంతా క్రియేట్ చేసిందే తప్ప ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉంటారని చెప్పాడు.

అలాగే జబర్దస్త్ కి, ఎక్స్ట్రా జబర్దస్త్ కి షూట్ టైమింగ్స్, డేట్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి కాబట్టి లోపల ఇంటర్నల్ గా అసలేం జరుగుతుంది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఎప్పుడన్నా మాటల సందర్భంలో ఏవన్నా ఎవరన్నా విషయాలు చెప్తే తప్పా అన్నాడు అభి. ఇక "ఎవరేం మాట్లాడారు అన్న విషయాల మీద నాకు ఎలాంటి అవగాహన లేదు ఎవరి ఒపీనియన్స్ ని వాళ్ళు చెప్పారేమో" అన్నాడు. ఇక జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయని అందులో ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా సాల్వ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ లా ముందుకెళ్తుంటామని చెప్పాడు. ఐతే తానూ కూడా కొంత కాలం కిందటే షో నుంచి బయటికి వచ్చేసాడు కాబట్టి తనకు ఎలాంటి విషయాలు తెలియవు అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు అభి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.